CM Revanth Reddy On Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా?, దానిని కూల్చాలా వద్దా? అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటాకాలా అని ఆగ్రహం

కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

CM Revanth Reddy Strong Warning to KTR on Janwada Farmhouse Demolish(X/CMO)

Hyd, Oct 3:  హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

సబితమ్మ పేద అరుపులు వద్దూ......నీకున్న ఫాంహౌస్ ల లెక్కలు కూడా ఉన్నాయన్నారు. మీ ఫాంహౌస్ లు ఎక్కడ కూలిపోతాయోనని భయపడి పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు అని మండిపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ మీరు కట్టుకున్న ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికి నీటి హైదరాబాద్ ప్రజలు తాగాలా ఆలోచించాలన్నారు.

హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరగలేదా..? ఆ రోజు సూచనలు చేసి ఉంటే ఈరోజు అడ్డగోలుగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు అన్నారు. పేదలకు ఏం చేయాలో చెప్పండి...మీ తాత సొమ్మొ, మా తాత సొమ్మొ కాదు..ప్రజల సొమ్మును పేదలకు పంచడంలో తప్పేముంది? అని ప్రశ్నించారు. కిరాయి మనుషులను పెట్టి మీరు చేస్తున్న హడావుడిని తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్.. 

Here's Video:

అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారు..హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తుంటే దానిపై కూడా బావబామ్మర్దులు బురద జల్లుతున్నారు అన్నారు. మీ పార్టీ ఖాతాలో తెలంగాణ సొమ్ము రూ.1500 కోట్లు ఉన్నాయి..పేదలపై మీకు అంత ప్రేమ ఉంటే ఒక రూ.500 కోట్లు మూసీ బాధితులకు, పేదలకు ఇవ్వాలన్నారు.

ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,రైతు భీమా కార్డు అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మీ అందిస్తామని..ఈ డిజిటల్ కార్డు....మీ కుటుంబానికి రక్షణ కవచం అని తేల్చిచెప్పారు రేవంత్ రెడ్డి.

Here's Video:



సంబంధిత వార్తలు

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్