Congress-CPM-CPI Alliance: తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులు ఖరారు, వామపక్షాలకు కేటాయించే సీట్లు ఇవే! కోదండరాం పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారంటే?

సీపీఎం, సీపీఐ పార్టీలకు రెండేసి చొప్పున సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. దీనిపై శనివారం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో భాగంగా సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు.

Revanth Reddy TPCC (Photo-Video Grab)

Hyderabad, OCT 20:  తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress), సీపీఎం-సీపీఐ మధ్య పొత్తు (CPM - CPI Alliance) పొడిచింది. సీపీఎం, సీపీఐ పార్టీలకు రెండేసి చొప్పున సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. దీనిపై శనివారం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో భాగంగా సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను కేటాయించింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తారు.

Telangana Assembly Elections 2023: టీడీపీకి తెలంగాణలో షాక్, బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

కాగా, పొత్తులతో పోటీచేసే పార్టీలతో కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో టీజేఎస్ (TJS) పార్టీ చీఫ్ కోదండరాంతో కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తమకు మొత్తం ఆరు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోదండరాం కోరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు ఆ ఆరుగురు అభ్యర్థుల జాబితాను కూడా అందించారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ (Telangana Assembly Election) కాంగ్రెస్ తో కలిసి టీజేఎస్ పొత్తుతో పోటీ చేసింది.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం