వనపర్తి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో రావుల చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ తరపున 1994, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్రభుత్వ విప్‌గా పని చేశారు.
రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి టీడీపీ ముఖ్య నాయకులు వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. రావుల మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. చంద్రబాబు ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా నియమించారు. వనపర్తి జిల్లాలో రావుల చంద్రశేఖర్ రెడ్డికి మంచి పట్టుంది.
Here's News
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి pic.twitter.com/C3FbzLzoaU
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)