Container Catches Fire: ఖ‌రీదైన కార్లు త‌ర‌లిస్తున్న కంటైన‌ర్ లో చెల‌రేగిన మంట‌లు, పూర్తిగా కాలిపోయిన 8 కార్లు, జహీరాబాద్ హైవేపై ఘ‌ట‌న‌

8 కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ లో చోటు చేసుకుంది. ముంబై నుంచి కార్లను తరలిస్తున్న కంటైనర్.. జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే..ఒక్కసారిగా మంటలు (Container Catches Fire) చెలరేగాయి.

Container Catches Fire

Zaheerabad, NOV 10: కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్ లో మంటలు (Fire Accident in Zaheerabad) చెలరేగి.. 8 కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ లో చోటు చేసుకుంది. ముంబై నుంచి కార్లను తరలిస్తున్న కంటైనర్.. జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే..ఒక్కసారిగా మంటలు (Container Catches Fire) చెలరేగాయి. గమనించిన డ్రైవర్.. కంటైనర్ ను పక్కకు నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే పూర్తిగా మంటలు కంటైనర్ అంతా వ్యాపించాయి. అందులో ఉన్న 8 కొత్త కార్లు మంటల్లో కాలిపోయాయి.

Container vehicle went in flames at Zaheerabad

 

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలను ఆర్పే క్రమంలో కంటైనర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. డ్రైవర్ ను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు, తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టరెంట్‌లో పేలిన ఫ్రిజ్ కంప్రెషర్, ధ్వంసమైన ప్రహరీ గోడ...వీడియో ఇదిగో  

ముంబై నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లో కార్లను తరలిస్తున్నారు. ఆ కంటైనర్ అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ కు కంటైనర్ కు మధ్యలో స్పార్క్ రావడంతో మంటలు చెలరేగాయని, చూస్తుండగానే మంటలు పూర్తిగా వ్యాపించాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కంటైనర్ లో కొత్త కార్లు మంటల్లో కాలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న కంటైనర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. డ్రైవర్ ను జహీరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.