Corning Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, భారత్‌లో తొలిసారి గొరిల్లాగ్లాస్ తయారీ కంపెనీ ఇన్వెస్టిమెంట్లు, తెలంగాణలో ఏకంగా రూ. 934 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన
934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ (Gorilla Glass) తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ (Corning Company) కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
Hyderabad, SEP 01: రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ (Gorilla Glass) తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ (Corning Company) కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.
మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ (Corning Company).. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను (Corning Gorilla Glass) తయారు చేయడానికి తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.