Covid in Telangana: కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం సౌకర్యాలు పెంచుతామని తెలిపిన సోమేష్‌కుమార్, రాష్ట్రంలో తాజాగా 2,070 మందికి కోవిడ్, 18 మంది మృతితో 3,364కి పెరిగిన మరణాల సంఖ్య
దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరింది.
Hyd, June 5: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,38,182 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,070 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (Telangana logs 2,070 new Covid-19 cases) అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరింది. తాజాగా మరో 18 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,364కి పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.
కరోనా మూడో వేవ్‌కు (Coronavirus Third Wave) తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నీలోఫర్ ఆసుపత్రిని సీఎస్ సోమేష్‌కుమార్ సందర్శించారు. మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో నీలోఫర్ డాక్టర్లతో సోమేష్‌కుమార్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో వేవ్‌కు రెడీ అవుతున్నామని తెలిపారు. నీలోఫర్‌లో పరిస్థితి అధ్యయనం చేసి నివేదిక రెడీ చేస్తున్నామని చెప్పారు. నీలోఫర్‌లో వెయ్యి పడకలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం సౌకర్యాలు పెంచుతామని సోమేష్‌కుమార్ తెలిపారు.
జూన్ 7న 19 వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందన్నారు. పేదలకు జబ్బు చేస్తే ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. దశల వారీగా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Here's TS Covid Report
డయాగ్నస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, తెలంగాణలో ప్రతి పౌరుడికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు ఇస్తామని, వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తామని చెప్పారు.