Covid Nasal Vaccine: మరో కీలక అడుగు..ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్, రెండు, మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్, యూఎస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ బయోటెక్
ఇప్పటివరకు ఇంజెక్షన్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తుండగా ఇకపై ముక్కు ద్వారా వ్యాక్సిన్ (Covid Nasal Vaccine) అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ.. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను తయారు చేసింది. దేశవ్యాప్తంగా ఈ టీకాను కరోనా రాకుండా ప్రజలకు అందిస్తున్నారు.
Hyderabad, August 14: వ్యాక్సినేషన్ లో మరో కీలక అడుగు పడింది. ఇప్పటివరకు ఇంజెక్షన్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తుండగా ఇకపై ముక్కు ద్వారా వ్యాక్సిన్ (Covid Nasal Vaccine) అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ.. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను తయారు చేసింది. దేశవ్యాప్తంగా ఈ టీకాను కరోనా రాకుండా ప్రజలకు అందిస్తున్నారు. అయితే.. కరోనా వ్యాక్సిన్‌లో మరో ముందడుగు వేసింది భారత్ బయోటెక్. ఇంజెక్షన్ల ద్వారా కాకుండా.. డైరెక్ట్‌గా ముక్కు ద్వారా వేసే కరోనా టీకాను (Adenoviral Intranasal Covid-19 vaccine) తయారు చేసింది.
ఈ టీకాకు (Bharat Biotech's Covid nasal vaccine) సంబంధించి రెండు, మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ వ్యాక్సిన్ కి BBV154 నామకరణం చేసింది. దీన్నే Adenoviral Intranasal Covid-19 vaccine అని పిలుస్తారు. నాజల్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. ఈ వ్యాక్సిన్ కోసమే.. భారత్ బయోటెక్.. యూఎస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చకుంది. మొదటి దశ క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా.. 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారికి ఈ టీకాను ముక్కు ద్వారా ఇచ్చి టెస్ట్ చేశారు. అది విజయవంతం అయినట్టు కంపెనీ వెల్లడించింది.
వాళ్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవడంతో.. రెండు, మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ అనుమతి కోసం భారత్ బయోటెక్.. కేంద్రాన్ని కోరగా.. కేంద్రం ఓకే చెప్పింది. అయితే.. ఇప్పటి వరకు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లకు హ్యూమన్ క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించలేదు. మొదటిసారి హ్యూమన్ క్లీనికల్ ట్రయల్స్‌కు అనుమతి పొందిన వ్యాక్సిన్ ఇదే. ఈ వ్యాక్సిన్‌ను జంతువులలోనూ పరీక్షించగా.. పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. జంతువులలో ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత యాంటీ బాడీల శాతం పెరగడంతో.. మనుషులపై క్లీనికల్ ట్రయల్స్‌కు భారత్ బయోటెక్ ముందడుగు వేసింది.