Omicron in Telangana: తెలంగాణలో కరోనా అలర్ట్, కలవర పెడుతున్న BA5, BA4, BA.2.12.1 రకాల ఓమిక్రాన్ వేరియంట్లు, కోవిడ్ కేసుల పెరుగుదలకు ఇదే కారణమంటున్న INSACOG

భారత్ లో కరోనా వైరస్ జన్యు శ్రేణి, వైరస్ వైవిధ్యాన్ని అధ్యయనం చేసే INSACOG సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం BA5, BA4, BA.2.12.1 రకాల ఒమిక్రాన్ వేరియంట్లు సామాజిక వ్యాప్తి దశలో ఉన్నాయని తేలింది.

omicron

Hyd, June 20: తెలంగాణలో కరోనా మళ్లీ చాపకింద నీరులా పాకుతతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కనిపిస్తున్నాయి. భారత్ లో కరోనా వైరస్ జన్యు శ్రేణి, వైరస్ వైవిధ్యాన్ని అధ్యయనం చేసే INSACOG సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం BA5, BA4, BA.2.12.1 రకాల ఒమిక్రాన్ వేరియంట్లు సామాజిక వ్యాప్తి దశలో ఉన్నాయని తేలింది. రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ మూడు రకాలే కారణమవుతున్నాయని జూన్ 15 వరకు ఉన్న డేటా సూచిస్తోంది.

BA5 పాజిటివ్ కేసులు ఇప్పుడు 21కి చేరగా, పది BA4 కేసులు ఉన్నాయి. మరో 51 మందిలో BA.2.12.1 వేరియంట్‌ను గుర్తించినట్టు INSACOG తెలిపింది. అమెరికా, యూరప్ దేశాలలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం. తెలంగాణలో యాక్టివ్‌గా ఉన్న ఈ మూడు వేరియంట్లు చాలా వేగంగా వ్యాపించగలవు. అలాగే వీటికి యాంటీబాడీస్ నుండి తప్పించుకునే సామర్థ్యం ఉంటుంది. BA4, BA5 అయితే వ్యాక్సిన్ నుంచి వచ్చే ప్రతిరోధకాలను కూడా తప్పించుకోగలవని, BA1కు సహజ ప్రతిరోధకాలను తప్పించుకునే సామర్థ్యం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.

తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మొద్దు, ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయండి, ఉపసంహరణ పేరుతో అడ్డికి పావుశేరు అమ్ముతున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపాటు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ

BA4 , BA5 వేరియంట్లు దక్షిణాఫ్రికా, అమెరికాతో పాటు ఐరోపా దేశాలలో అధికంగా వ్యాప్తి చెందాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు కూడా సోకిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. BA4 , BA5 వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ వాటి వల్ల తీవ్రమైన లక్షణాలు ఏమీ ఉండటం లేదంటున్నారు. అందుకే రోజువారీ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ బాధితులు ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరడం లేదని, మరణాలు కూడా అదుపులోనే ఉన్నాయని అంటున్నారు.