IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్, పలువురు సీపీలు, ఎస్పీలకు స్థానచలనం

మొత్తం 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌(CV Anand)ను నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్‌(Anjani kumar)ను ఏసీబీ డీజీగా నియమించారు.

Hyderabad December 25: తెలంగాణ(Telangana)లో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లను(IPS transfers in Telangana) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌(CV Anand)ను నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్‌(Anjani kumar)ను ఏసీబీ డీజీగా నియమించారు. వారితో పాటూ ఏసీబీ డైరెక్టర్‌గా శిఖా గోయల్, హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్)గా ఏఅర్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట్ సీపీగా శ్వేత, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్)గా కల్మేశ్వర్‌ను నియమించారు.

15 DSPs Transferred in TS: తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రగతి భవన్‌లో నేడు సీఎం కేసీఆర్ కీలక సమావేశం

ఇక సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్ సీసీఎస్‌ డీసీపీగా గజరావు భూపాల్, హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీగా నాగరాజు, అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, బాలానగర్ డీసీపీగా సందీప్ గొనె, శంషాబాద్ డీసీపీగా జగదీష్ రెడ్డి, హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్‌ జాయింట్ సీపీగా కార్తికేయ, మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ గా ప్రకాష్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్ ఎస్పీగా మనోహర్, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, జనగాం డీసీపీగా సీతారామ్, నారాయణ్‌పేట్‌ ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లును నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.