Cyberabad Police: ఫేక్ ఇన్సూరెన్స్‌ తయారీదారులకు సీపీ సజ్జనార్ వార్నింగ్, ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని తెలిపిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసే 11 మంది అరెస్ట్

నగరంలో ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసే ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Cyberabad police have arrested 11 gang members for making fake vehicle insurance copies (Photo-Twitter/cyberabad police)

Hyderabad, Jan 5: నగరంలో ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసే ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. అరెస్టయిన సభ్యుల్లో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ప్రధాన సూత్రధారుడిగా పేర్కొన్నారు.

నిందితుడు ఆర్టీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ వెహికల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రమేష్‌తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. ముఠా సభ్యుల నుంచి 1125 ఫేక్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వారి నుండి భారీగా వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశామన్నారు. మధ్యాహ్నం మీడియా ముందుకు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు.

Here's Cyberabad Police Tweet

తెలంగాణ ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ

తెలంగాణ ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టుకు దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అవకతవకలకు పాల్పడ్డారని ఆయన లేఖలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ది కోసమే టీఆర్‌ఎస్‌ నేతలు రూ.10వేలు పంచారని శ్రవణ్ ఆరోపించారు. దాసోజు శ్రవణ్ లేఖను పిల్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.

కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం, టీవీ రిపేరింగ్ సెంటర్‌లో ఎగసి పడిన మంటలు, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది

జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా స్థాయిలోని వివిధ శాఖలలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31లోగా పూర్తి చేయాలన్నారు. జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు.

డ్రగ్స్‌ కేసు..ఎన్‌సీబీ కస్టడీ నుంచి తప్పించుకున్న టాలీవుడ్ నటి, అప్రమత్తమైన ముంబై పోలీసులు, మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్లుగా వార్తలు

వారం రోజుల్లో తెలంగాణకు కరోనా వ్యాక్సిన్‌

వారం రోజుల్లో తెలంగాణకు కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని హెల్త్‌ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 2.60 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు తొలిదశ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 5 కోట్ల డోసులు భద్రపరిచేలా ఫ్రీజర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో అందుబాటులో 850 కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్నాయన్నారు. అలాగే 5లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు 75 లక్షల మంది ప్రజలకు తొలిదశ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. వృద్ధులు, వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ రియాక్షన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. కరోనా స్ట్రెయిన్ ప్రభావం తెలంగాణలో లేదన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now