Fire Accident in Kukatpally: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం, టీవీ రిపేరింగ్ సెంటర్‌లో ఎగసి పడిన మంటలు, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
Fire (Representational image) Photo Credits: Flickr)

Hyderabad, Jan 5: హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ టీవీ రిపేరింగ్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడం..దట్టమైన పొగలు అలుముకోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

కూకట్ పల్లిలో మొదటగా చిన్నగా మొదలైన అగ్నిప్రమాదం ఒక్కసారిగా దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనే ఉన్న మిగతా షాప్ యజమానులు గమనించి పోలీసులు, స్థానికంగా ఉన్న ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ అధికారులు మంటలను అదపు చేశారు.

టీవీ షో రూమ్ కావడంతో ఎలక్ట్రిక్ కు సంబంధించిన ఐటెమ్స్ అన్ని కూడా మంటలకు కాలిపోయాయి. ప్రస్తుతం మంటలను కొద్ది మేరకు అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

డ్రగ్స్‌ కేసు..ఎన్‌సీబీ కస్టడీ నుంచి తప్పించుకున్న టాలీవుడ్ నటి, అప్రమత్తమైన ముంబై పోలీసులు, మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్లుగా వార్తలు

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా అగ్ని ప్రమాదంతో మంటలు చెలరేగడంతో పక్కనే మెడికల్ షాపులతో  పాటు పలు షాపింగ్ సముదాయాలకు మంటలు వ్యాపించకుండా పోలీసులు ముందస్తుగా వాటిని మూసివేయించారు.