December 31 Restrictions: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే! నిబంధనలు విడుదల చేసిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, 2డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే అనుమతి
కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకండి. కానీ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల(Hyderabad New year) సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ (CV Anand)మార్గదర్శకాలు జారీ చేశారు.
Hyderabad December30: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు(New Year celebrations in Telangana) అనుమతిచ్చిన ప్రభుత్వం...పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకండి. కానీ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల(Hyderabad New year) సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ (CV Anand)మార్గదర్శకాలు జారీ చేశారు.
అర్ధరాత్రి 12 వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకూ బార్లు(Bars), పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే త్రీస్టార్ హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌ల నిర్వాహకులు ట్రై పోలీస్ కమిషనర్ల నుంచి వినోదానికి సంబంధించి తాత్కాలిక లైసెన్స్ తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ప్రభుత్వం ఈనెల 25వ తేదీన జారీ చేసిన 327 జీవో ప్రకారం వేడుకలకు హాజరయ్యే వారు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా నిర్వాహకులు, చూడాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సీపీ మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు, క్లబ్‌లు మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు.
న్యూ ఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే...
* వేడుకల్లో మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా.
* రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి.
* వేడుకల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
* వేడుకలకు రెండ్రోజుల ముందు అనుమతి తప్పనిసరి.
* సిబ్బందికి 48గంటల ముందు కొవిడ్ పరీక్షలు చేయాలి.
* బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు.
* ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చర్యలు.
* మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలు, రూ.10వేల జరిమానా
* అసభ్యకర దుస్తులు ధరించినా.. నృత్యాలు చేసినా చర్యలు.
* వేడుకల్లో మాదక ద్రవ్యాలకు అనుమతిస్తే చర్యలు. విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాం. మహిళలపై వేధింపులను అరికట్టడానికి షీ బృందాలు, పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు సీపీ ఆనంద్ చెప్పారు.