Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విస్తుగొలిపే విషయాలు, బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కవిత, మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు, కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు ఇవిగో..

ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజుల పాటు (ఈనెల 14 వరకు) కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

BRS Leader K Kavitha (File Image)

New Delhi, April 12: ఢిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజుల పాటు (ఈనెల 14 వరకు) కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు.

ఈనెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పర్చాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం విధానంలో కీలక సూత్రధారి, పాత్రధారి కవితే అని సీబీఐ వాదించింది. విచారణకు ఆమె సహకరించడంలేదని, అందుకే కస్డడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించింది. కవిత కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలను సీబీఐ ప్రస్తావించింది.  ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన సీబీఐ, మధ్యాహ్నం తరువాత వాదనలు వింటామని తెలిపిన ధర్మాసనం

మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి జాగృతి సంస్థకు రూ.80 లక్షల ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్లు అందులో పేర్కొంది. సీబీఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది.ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని రిపోర్టు రిపోర్టులో వెల్లడించింది.  సీబీఐ అరెస్టుపై కోర్టును ఆశ్ర‌యించిన ఎమ్మెల్సీ క‌విత‌, అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని లాయ‌ర్ విజ్ఞ‌ప్తి

మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనని అన్నారు శరత్‌. మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు పేర్కొంది.  CBI Arrests Kavitha: తీహార్‌ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు 

ఒక్కో రిటైల్ జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కు కవితే రూ.100కోట్లు చెల్లించారని చెప్పింది.

ఇండోస్పిరిట్లో కవిత 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని, ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలిపింది. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif