Telangana Jobs: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణలో జిల్లాలు, శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో, వయోపరిమితి ఎంత పెంచారో ఇక్కడ చెక్ చేసుకోండి

రాష్ట్రంలో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. హోం, విద్య‌, వైద్యారోగ్య శాఖ‌లో భారీగా ఖాళీలు ఉన్నాయి.

Image used for representational purpose. (Photo Credits: PTI)

Hyd, March 09:  రాష్ట్రంలో 80,039 ఖాళీలు ఉన్నాయని, (Details of Job replacement) వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. హోం, విద్య‌, వైద్యారోగ్య శాఖ‌లో భారీగా ఖాళీలు ఉన్నాయి. హోంశాఖ‌లో 18,334, సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌లో 13,086, హాయ్య‌ర్ ఎడ్యుకేష‌న్‌లో 7,878, వైద్యారోగ్య శాఖ‌లో 12,755 ఖాళీల‌కు నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌నున్నాయి.

జిల్లా స్థాయిలో 39, 829 ఉద్యోగ ఖాళీలు, జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగ ఖాళీలు, మల్టీ జోన్ లో 13,170 ఉద్యోగ ఖాళీలు, ఇతర కేటగిరి, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3 -1373 పోస్టులు, గ్రూప్ 4-9168 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

శాఖల వారీగా ఖాళీలు..

హోం శాఖ- 18,334

సెకండరీ ఎడ్యుకేషన్- 13,086

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755

హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878

బీసీల సంక్షేమం- 4,311

రెవెన్యూ శాఖ- 3,560

ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879

నీటిపారుదల శాఖ- 2,692

ఎస్టీ వెల్ఫేర్- 2,399

మైనారిటీస్ వెల్ఫేర్- 1,825

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455

లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221

ఆర్థిక శాఖ- 1,146

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859

అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801

రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563

న్యాయశాఖ- 386

పశుపోషణ, మత్స్య విభాగం- 353

జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343

ఇండస్ట్రీస్, కామర్స్- 233

యూత్, టూరిజం, కల్చర్- 184

ప్లానింగ్- 136

ఫుడ్, సివిల్ సప్లయిస్- 106

లెజిస్లేచర్- 25

ఎనర్జీ- 16

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..

జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్ – 5,268

నిజామాబాద్- 1,976

మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769

రంగారెడ్డి- 1,561

కరీంనగర్- 1,465

నల్లగొండ- 1,398

కామారెడ్డి- 1,340

ఖమ్మం- 1,340

భద్రాద్రి కొత్తగూడెం- 1,316

నాగర్‌కర్నూల్- 1,257

సంగారెడ్డి- 1,243

మహబూబ్‌నగర్- 1,213

ఆదిలాబాద్- 1,193

సిద్దిపేట- 1,178

మహబూబాబాద్- 1,172

హనుమకొండ- 1,157

మెదక్- 1,149

జగిత్యాల- 1,063

మంచిర్యాల- 1,025

యాదాద్రి భువనగిరి- 1,010

జయశంకర్ భూపాలపల్లి- 918

నిర్మల్- 876

వరంగల్- 842

కుమ్రం భీం ఆసీఫాబాద్- 825

పెద్దపల్లి- 800

జనగాం- 760

నారాయణపేట్- 741

వికారాబాద్- 738

సూర్యాపేట- 719

ములుగు- 696

జోగులాంబ గద్వాల- 662

రాజన్న సిరిసిల్లా- 601

వనపర్తి- 556

ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచిన ప్రభుత్వం

>> ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు

>> ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు

>> దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు

>> ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు

>> హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

TGSRTC Good News: కండక్టర్‌ వద్ద చిల్లర తీసుకోవడం మర్చిపోయారా?.. అయితే ఈ నంబర్‌ కు కాల్‌ చేయండి.. పూర్తి వివరాలు ఇవిగో..!

Bus Accident: ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్.. 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.. కరీంనగర్ లో ఘటన (వీడియో)

MP Horror: ఐదేళ్ల చిన్నారిపై 17 ఏండ్ల యువకుడి దారుణం.. చిన్నారిని అపహరించి అఘాయిత్యం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక.. మధ్యప్రదేశ్‌ లో ఘోరం

AP Full Budget Today: నేడే పూర్తిస్థాయి బ‌డ్జెట్.. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏపీ సర్కారు.. సుమారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో రాష్ట్ర బ‌డ్జెట్

Share Now