Stray Dogs In Siddipet: సిద్దిపేటలో వీధి కుక్క హల్ చల్.. అదనపు కలెక్టర్ పై పడి రక్కిన శునకం.. తీవ్ర గాయాలు.. దవాఖానలో చేరిక
అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి.
Siddipet, April 4: సిద్దిపేట (Siddipet) కలెక్టరేట్ ప్రాంతంలో వీధి కుక్కలు (Stray Dogs) బీభత్సం సృష్టిస్తున్నాయి. అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి. ఈ ఘటనలో కలెక్టర్ (Collector) పెంపుడు శునకమూ తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట శివారులో కలెక్టరేట్‌తోపాటు అధికారుల నివాసాలు ఉన్నాయి. శనివారం రాత్రి అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క కరిచింది. ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో ఉంచి పరిశీలనలో పెట్టారు.
మరో వీధికుక్క అదేరోజు రాత్రి ఇంకో వ్యక్తిని, కలెక్టర్ పెంపుడు శునకాన్ని కరిచింది. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఓ బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు. బాధిత కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.