Don't Stop Traffic for Me: నా కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని వెల్లడి

తన కోసం, తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

Revanth Reddy(Photo0X)

Hyd, Dec 15: పరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌నూ అనుమతించాలని ఆదేశించారు.ప్రజలతో పాటే తన కాన్వాయ్‌ ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండానే తన కాన్వాయ్‌ను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది.

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు.. ఆధార్, ఓటరు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి

సీఎంతో పాటు మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటన సమయంలో ట్రాఫిక్‌ నిలిపివేత గురించి తెలిసిందే. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అది మరీ నరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కాన్వాయ్‌ విషయంలోనూ ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేయకుండా.. తన కాన్వాయ్‌లోనే ఉన్న అన్ని తెల్ల రంగు కార్లకు నల్ల రంగు వేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

SC Dismisses Plea for Ballot Paper: పేప‌ర్ బ్యాలెట్‌తో ఎన్నిక‌లు నిర్వాహించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్