Hyderabad, Dec 15: ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను (Zero Tickets) జారీ చేయనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. జీరో టిక్కెట్ కోసం మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్ (Aadhaar), ఓటరు, తదితర గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపి, విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని కోరారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు.
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో… pic.twitter.com/XgPKGPqtpf
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)