సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మోసాలపై అందర్నీ అలర్ట్ చేసే సజ్జనార్ తాజాగా మరో వీడియో ద్వారా అందర్నీ అప్రమత్తం చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!! మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు.మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా ఈమధ్య పెరిగిపోతున్న మోసాలు. న్యూడ్ వీడియోల వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సిందే.మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి.

అమలాపురంలో భారీ చోరీ..యజమాని నిద్రిస్తుండగా రూ.20 లక్షల విలువ చేసే బంగారం చోరీ, పోలీసుల దర్యాప్తు

TSRTC MD VC Sajjanar Shares Video on Online Fraud

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)