ప్రజాపాలన విజయోత్సవాలు వేడుకల్లో భాగంగా తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ నూతన లోగోను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం TGSRTCని తెలంగాణ రవాణా శాఖ (TGTD) గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది . పునరుద్ధరించబడిన గుర్తింపు ఆధునికీకరించిన, సమర్థవంతమైన మరియు స్థిరమైన రవాణా కోసం రాష్ట్ర దృష్టిని సూచిస్తుంది.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సంవత్సర కాలంలో సాధించిన విజయాల బ్రౌచర్ విడుదల చేశారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు పత్రాలను అందించారు. 115.76 కోట్ల ఉచిత ప్రయాణదారులకు 39.02 కోట్లు ఆదా అయినా చెక్కును ప్రయాణికులకు అందించారు.
Telangana Transport Department’s New Logo Unveiled by CM Revanth Reddy
TGSRTC కాదు.. ఇకపై TGTD
TGSRTC పేరును ప్రభుత్వం తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్(TGTD)గా మార్చింది. ఈ మేరకు ఆర్టీసీ లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. సంవత్సర కాలంలో సాధించిన విజయాల బ్రౌచర్ విడుదల చేశారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు పత్రాలను అందించారు. 115.76 కోట్ల ఉచిత… pic.twitter.com/S5IfOB5QMT
— ChotaNews (@ChotaNewsTelugu) December 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)