Police Constables Hall Tickets: ఇవాల్టి నుంచే పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష హాల్‌ టికెట్ డౌన్‌లోడ్‌, ఎక్కడ అందుబాటులో ఉంటాయంటే..? ఒకవేళ సమస్య వచ్చిదంటే ఈ నెంబర్‌లో సంప్రదించండి!

కానిస్టేబుల్‌ పరీక్షకు (Constable Exam) హాజరయ్యే అభ్యర్థులు గురువారం నుంచి హాల్‌ టికెట్లను (Hall ticket) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది.

Exam. Representative Image. (Photo Credits: Pixabay)

Hyderabad, AUG 18: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ (preliminary written test) ప్రాథమిక పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ల డౌన్‌ లోడ్‌ కు సంబంధించి ప్రకటన విడుదలయింది. ఆగస్టు 28న పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష జరుగునున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్‌ పరీక్షకు  (Constable Exam) హాజరయ్యే అభ్యర్థులు గురువారం నుంచి హాల్‌ టికెట్లను (Hall ticket) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు www.tslprb.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ హాల్ టికెట్లకు సంబంధించి ఏమైనా సందేహాలున్నా, డౌన్‌లోడ్ కాకపోయినా.. support@tslprb.inకి మెయిల్ చేయాలని.. లేదంటే 93937 11110, 93910 05006 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది.

AP Dharmika Parishad Committee: పదేళ్ల తరువాత ఏపీలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు, పరిషత్‌లో మొత్తం 21 మంది సభ్యులు, ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కారు 

రాష్ట్ర వ్యాప్తంగా 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (TSLPRB) ఏప్రిల్ 25,2022న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్‌ పోస్టులతో రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొబిషన్‌లో 614 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది.

Telangana: బీజేపీపై మరోసారి సీఎం కేసీఆర్ విసుర్లు, మతం పేరుతో మనుషుల్ని విడదీస్తుందంటూ ఫైర్, దేశంలో సమస్యలపై గ్రామగ్రామాన చర్చ పెట్టాలంటూ పిలుపు  

ఆయా పోస్టులకు సంబంధించి ప్రాథమిక పరీక్ష ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఆయా కానిస్టేబుల్‌ పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది.