Hyderabad, AUG 18: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించారు. నూతనంగా నిర్మించిన మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ (CM Kcr) ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. గత 40 ఏళ్ల నుంచి తాను ప్రజాజీవితంలోనే ఉన్నానని ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా సేవలందించాను అంటూ గుర్తు చేశారు. ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండాలని అందుకే తెలంగాణలో జిల్లాల విభజన చేపట్టామని దాంట్లో భాగంగా మేడ్చల్ జిల్లా ఏర్పడిందని మేడ్చల్ జిల్లా ఏర్పడనప్పుడు పెద్ద చర్చ జరిగింది అంటూ వివరించారు. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని రాష్ట్ర అన్నారు. ఈ రోజు మేడ్చేల్ మల్కాజ్‌గిరి జిల్లా (Medchal Malkajgiri district) ఏర్పాటు చేసుకొని.. ఈ జిల్లా పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నామని..ఈరోజు దాన్ని ప్రారంభించుకున్నామని దానికి జిల్లా ప్రజలందరికీ అభినందనలు..శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.
CM Sri KCR inaugurated Medchal-Malkajgiri District Collectorate and Integrated District Offices' Complex today. Hon'ble CM later addressed a public gathering. #TrailblazerTelangana pic.twitter.com/YVgaT6Rjjw
— Telangana CMO (@TelanganaCMO) August 17, 2022
పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరిగుతాయో ఇప్పుడు మనం అంతా చూస్తున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న సమయంలో జిల్లా చేసే సందర్భంగా పెద్దగా చెర్చ జరిగిందని… మూడు జిల్లాలు అవుతాయని చెప్పారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కావొచ్చు.. అలా చేస్తే భవిష్యత్‌లో బాగుంటుందని పెద్దలు చెప్పడం, ప్రజాప్రతినిధులు, మంత్రులు కోరడం.. జనాభాను పరిశీలించినప్పుడు చాలా పెద్ద జిల్లాగా ఉండడం, పరిపాలన సౌలభ్యం గొప్పగా ఉండాలంటే, ప్రజలకు అన్నీ మంచి పనులు నెరవేరాలంటే తప్పకుండా మేడ్చల్ జిల్లా కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు.దాంట్లో భాగంగానే తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడ్డాయని తెలిపారు.
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజల సమస్యలను సులువుగా తెలుసుకోగలుగుతున్నామని దాంట్లో భాగంగానే ప్రజలకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు.. దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు అద్భుతంగా అందజేస్తున్నామని..మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దళారీల ప్రమేయం లేకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా సమయానికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 36లక్షల పెన్షన్లు ఉన్నయ్. మరో 10లక్షల పెన్షన్లు ఆగస్టు 15 నుంచి ఇస్తామని తెలిపారు. కరోనాతో కొంత ఆలస్యమైంది. 57 సంవత్సరాల వారికి ఇస్తామని చెప్పాం. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తికమక అయిన పరిస్థితుల్లో కొంత ఆలస్యమైందని వివరించారు. రాబోయే వారం పదిరోజుల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని’ సీఎం కేసీఆర్ కోరారు.
దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో, బస్తీలు.. ఎక్కడికక్కడ చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించి, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ సమాజమైతే, ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా, నిద్రాణమై, నిర్లక్ష్యంగా ఉంటరో వారు దెబ్బతినే అవకాశం ఉంటుంది. 60 సంవత్సరాల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండే. ఆ సమయంలో మనకు ఇష్టం లేకపోయినా.. పోరాడలేదు కాబట్టి తెలంగాణను తీసుకుపోయి.. ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఎన్ని బాధలు పడ్డాం. ఎంత మంది పిల్లలు చనిపోయారు? ఎంత మంది జైళ్లపాలయ్యారు? 58 సంవత్సరాలు మడమతిప్పని పోరాటం చేస్తే మళ్లా మన రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే.. కరెంటు మనకు వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? ఇన్ని పింఛన్లు వచ్చేవా? ఈ విధంగా మంచినీళ్లు వచ్చేవా? చాలాచాలా అవస్థల్లో ఉండేవాళ్లం. దేశంలో జరిగే రాజకీయాలను, దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు గ్రామాల్లో, సిటీ అయితే గ్రామాల్లో చర్చలు జరిగాలి. టీవీల్లో వార్తలు చూసి వదిలేయవద్దు. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తుంది. చైతన్యం కోల్పోయి ఉంటే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది’ అన్నారు.