హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గోరంట్ల మాధవ్ వీడియోపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నై సీబీఐ సైబర్ క్రైమ్ కార్యాలయానికి ఫిర్యాదును  ఈ-మెయిల్‌ ద్వారా పంపారు. ఈ ఫిర్యాదుతో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను న్యాయవాది లక్ష్మీనారాయణ జత చేసి, దీనిపై విచారణ జరపాలని కోరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)