DRI Seizes Smuggled Gold: హైద‌రాబాద్ లో భారీగా బంగారం ప‌ట్టివేత‌, ఏకంగా రూ. 2.9 కోట్ల గోల్డ్ సీజ్ చేసిన డీఆర్ఐ అధికారులు, ఇంత‌కీ గోల్డ్ ఎక్క‌డి నుంచి వచ్చిందంటే?

పట్టుకున్న బంగారం (Gold Seized) విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.9కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆదివారం తెలిపారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బస్సులో బంగారాన్ని (Gold) తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

RBI shifts 100 tonnes of gold from UK to its vaults, first time since 1991

Hyderabad, July 07: హైదరాబాద్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం (Gold Seized) విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.9కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆదివారం తెలిపారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బస్సులో బంగారాన్ని (Gold) తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బంగారం నాలుగు కిలోల వరకు ఉంటుందని డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు పేర్కొన్నారు.

Road Accident Video: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్‌, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు 

అక్రమంగా బంగారాన్ని పలువురు వ్యక్తులు తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు అధికారులు స్వాధీనం వలవేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు బట్టల్లో దారి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 3,982.25 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని.. బంగారం విలువ రూ.2.9కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులపై కస్టమ్స్‌ చట్టం కింద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.