IPL Auction 2025 Live

Earthquake in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు, ప్రజలు భయపడవద్దని తెలిపిన ఎన్‌జిఆర్‌ఐ

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా (Mild Quake of Magnitude 3.0) నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఇళ్లకు నష్టం జరగలేదు.

Earthquake Representative Image (Photo Credit: PTI)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు (Earthquake in Andhra Pradesh, Telangana) వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా (Mild Quake of Magnitude 3.0) నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఇళ్లకు నష్టం జరగలేదు.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం జగన్, సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

పులిచింతల జలాశయానికి సమీపంలో భూకంప కేంద్రం ఉంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోని (బ్లాక్‌లు) పలు గ్రామాల్లో ఉదయం 7.25 గంటల ప్రాంతంలో సుమారు 10 సెకన్లపాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది.ఇది పెద్ద భూకంపం కాదని ప్రజలు భయపడవద్దని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు కోరారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ, 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.అచ్చంపేట మండలంలోని మాదిపాడు, చల్లగరిగ, గింజుపల్లిలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించిందని ప్రజలు తెలిపారు. ఈ ప్రకంపనలు ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఈ ప్రాంతం జనవరి 26, 2020న 4.7 తీవ్రతతో భూకంపాన్ని కూడా చవిచూసింది.