Siddipet Steel Bank: ఆర్థిక సర్వేలో మెరిసిన సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌.. అసలేమిటీ బ్యాంక్?? దీని సక్సెస్ లో మున్సిపల్ కౌన్సిలర్ దంపతుల చొరవ ఏమిటీ??

సోమవారం పార్లమెంట్‌ లో సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Steel Bank inaugurated by Mrs Deepti Nagaraju

Siddipet, July 23: జాతీయ స్థాయిలో సిద్దిపేట (Siddipet) పేరు మరోసారి మెరిసింది. సోమవారం పార్లమెంట్‌ లో సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ (Siddipet Steel Bank) ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఏమిటీ ఈ బ్యాంకు? అనే చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చే లక్ష్యంతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, 39వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి దీప్తి నాగరాజు దంపతులు  కలిపి సంయుక్తంగా చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఎలాంటి కార్యక్రమాలు జరిగిన ఈ స్టీల్‌ బ్యాంకులోని పాత్రలను కిరాయికి ఇస్తారు. తద్వారా ప్లాస్టిక్‌ నియంత్రణ మరింత కట్టుదిట్టంకానున్నది. కాలుష్య నియంత్రణకు సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ తీసుకుంటున్న చర్యలు ఎంతో అద్భుతమని కేంద్రం ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించింది.

నేడు కేంద్ర బడ్జెట్‌.. 11 గంటలకు లోక్‌ సభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

కౌన్సిలర్ దంపతుల చొరవతో..

సిద్దిపేట పట్టణంలో ప్లాస్టిక్‌ నివారించాలనే ఉద్దేశంతో 43 వార్డులకు గాను తొలుత 34 వార్డుల్లో ప్రత్యేకంగా ఈ స్టీల్‌ బ్యాంక్‌ ను ఏర్పాటు చేశారు. 39వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి బోనగిరి దీప్తి, ఆమె భర్త నాగరాజు ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం ముందుకు సాగింది. స్టీల్‌ బ్యాంక్‌ పై కేంద్రం ప్రశంసలు కురిపించడం పట్ల దీప్తి నాగరాజు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

కెనడాలో స్వామి నారాయణ్‌ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు