Hyderabad, Feb 9: గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) (GBS) అనే నరాల వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ శనివారం మృతిచెందారు. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. సిద్దిపేట జిల్లా సిద్దిపేట (Siddipet) గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వివాహిత(25)కు ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు .ఇటీవల సదరు వివాహిత జీబీఎస్ బారిన పడింది. ఆమెను పరీక్షించి, వారంరోజులపాటు చికిత్స చేసిన స్థానిక వైద్యులు.. ఆమెను హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో.. వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్ పై ఉంచి చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో మహిళ మరణించారు.
అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??
తెలంగాణలో GBS వ్యాధి కలకలం.. మహిళ మృతి..!
గిలియన్ బార్ సిండ్రోమ్(GBS)తో బాధ పడుతున్న సిద్దిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన ఓ వివాహిత
గత నెల జనవరి 31న నమోదైన ఈ కేసు
చికిత్స పొందుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిన మహిళ pic.twitter.com/83VAOvKejd
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2025
అలా వ్యాప్తిలోకి..
తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు పాకుతుంది. ఊహించిన దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. క్రమంగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం 180 మందికి ఈ వైరస్ నిర్దారణ అవ్వగా.. ఒక్క పుణే జిల్లాలోనే 149 కేసులు నమోదయ్యాయి. తాజాగా, నాందేడ్ లో జీబీఎస్ బారినపడి చికిత్స పొందుతూ 60ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. మరణాల సంఖ్య పదికి దగ్గరగా ఉంది.
వ్యాధి ఎలా సోకుతుందంటే?
వైరల్ ఫీవర్లు, ఇన్ ఫెక్షన్ బారిన పడి రోగ నిరోధక శక్తి సన్నగిల్లడంతో కొంతమంది జీబీఎస్ బారిన పడుతుంటారని వైద్యులు చెప్పారు.