IPL Auction 2025 Live

Schools Bandh In Telangana, AP: రేపు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు, తెలంగాణలో ఇంటర్ కాలేజీలు రేపు బంద్ అని ప్రకటించిన ABVP

మంగళవారం విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో రేపు అన్ని విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ‌నున్నాయి. ఏపీ, తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు బంద్ కు స‌హ‌క‌రించాల‌ని విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.

తెలంగాణ, ఏపీలో రేపు అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్  కానున్నాయి.  మంగళవారం విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో రేపు అన్ని విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ‌నున్నాయి. ఏపీ, తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు బంద్ కు స‌హ‌క‌రించాల‌ని విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. ఏపీలో విద్యారంగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌కు నిర‌స‌న‌గా బంద్ కు పిలుపునివ్వగా, రేపు తెలంగాణలో ఇంటర్‌ కాలేజీల బంద్‌ కు  ఏబీవీపీ పిలుపు నిచ్చింది.  రేపటి బంద్ కు  ABVP, SFI, PDSU మద్దతు ఇచ్చాయి.

Andhra Pradesh: పదో తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు, ఇక నుంచి 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్, ఈనెల 29న ఏపీ కేబినేట్‌ సమావేశం

ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ కార్పొరేట్ విద్యాసంస్థల ముందు ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నారాయణగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.