Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం

ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది.

BRS Leader K Kavitha (File Image)

New Delhi, July 1: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.  ఢిల్లీ లిక్కర్‌ కేసు, కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఢిల్లీ సీఎంను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ డిమాండ్

అయితే దర్యాఫ్తు సంస్థలు ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. మూడు నెలలకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడ బెయిల్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif