Arvind Kejriwal

ఢిల్లీ లిక్కర్‌ కేసులో భాగంగా సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ శనివారం(జూన్‌29) రౌస్‌ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌ను 3 రోజులు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది. శనివారం ఈ రిమాండ్‌ ముగియడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్‌ని మరి కాసేపట్లో తీహార్ జైలుకు తరలించనున్నారు.మనీలాండరింగ్‌ కేసులో కోర్టు అనుమతితో ఇప్పటికే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  కేజ్రీవాల్ కు ముగిసిన సీబీఐ క‌స్టడీ, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజ‌రుప‌రిచిన అధికారులు, క‌స్ట‌డీకి అప్ప‌గింత‌పై తీర్పు రిజ‌ర్వ్

అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలోని దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగానినాదాలు చేశాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, నియంత పాలన అంతం.. కోసం అంటూ పార్టీ శ్రేణులు ప్లకార్డులను ప్రదర్శించాయి. మరోవైపు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద అనుమతి లేదంటూ ఆప్‌కి చెందిన ఆందోళనకారులను పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.