KTR supports Collector: జితేష్.. మీ గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్

నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman), కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ కు మద్దతుగా నిలిచారు.

Kamareddy, September 3: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ (Jitesh V Patil)కు మంత్రి కేటీఆర్ (KTR) బాసటగా నిలిచారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman), కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్‌కు మద్దతుగా నిలిచారు. ‘కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన నన్ను భయపెట్టింది.. ఈ రాజకీయ నాయకులూ కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను నిరుత్సాహపరుస్తారు.. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు’  అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నిర్మలా సీతారామన్ క్లాస్, రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంతో చెప్పలేకపోయిన కలెక్టర్, ప్రధాని ఫ్లెక్సీ పెట్టాల్సిందే! అంటూ కలెక్టర్‌కు కేంద్రమంత్రి ఆదేశం

కామారెడ్డి జిల్లా, బీర్కూర్ రేషన్ షాపు (Ration Shop)ను శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తనిఖీ చేశారు.ఈ క్రమంలో.. ఇక్కడ ప్రధాని మోదీ ఫ్లెక్సీ (Modi flexi) ఎందుకు లేదని జిల్లా కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించారు.