Fake FB Account: తెలివిమీరుతున్న సైబర్ క్రిమనల్స్, ఏకంగా జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు
దీంతో స్పందించిన కలెక్టర్ మోసపూరితమైన మెసేజ్‌లను నమ్మొద్దని తెలిపారు.
Warangal, May 23: సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా (Social Media) కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబర్ నేరగాళ్లు వరంగల్(Warangal) కలెక్టర్ పీ ప్రావీణ్య (Collector Praveenya)పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్(Fake Facebook account) ఓపెన్ చేసి డబ్బులు కావాలంటూ ఫేక్ మెసేజ్ పెట్టారు. దీంతో స్పందించిన కలెక్టర్ మోసపూరితమైన మెసేజ్‌లను నమ్మొద్దని తెలిపారు.
94776414080 శ్రీలంక నంబరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ పే చేసి స్క్రీన్‌షాట్ షేర్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దన్నారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని తెలిపారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.