GHMC Sanitation field officer kishan suspended Who sexually assaults sanitation wokrers

Hyd, May 23: జీడిమెట్ల పరిధిలో పారిశుధ్య కారిల్మికురాలుని లైంగికంగా వేధిస్తున్న వీడియోలు ఇవాళ ఉదయం వైరల్ అయిన సంగతి విదితమే. గాజులరామారం సర్కిల్ సూరారంలో ఎస్ ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే వ్యక్తి తనకింద పనిచేస్తున్న ఓ మహిళ కార్మికురాలిని గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినకుంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు. తాజాగా వీడియోలు బయటకు రావడంతో సూపర్ వైజర్ కిషన్ ను సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఘటనపై ఎంక్వైరీ చెయ్యాలని ఆదేశించారు కమిషనర్ రోనాల్డ్ రాస్.  దారుణం, వీడియో తీస్తూ మహిళా ఉద్యోగిపై జీహెచ్ఎంసీ అధికారి లైంగిక దాడి, మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని బెదిరింపులు

గాజులరామారం ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. మహిళా కార్మికురాలిని వేధించడాన్ని సీరియస్‌గా తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్‌కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

కుత్బుల్లాపూర్ పరిధిలో గల గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా కిషన్ పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే ఓ పారిశుద్ద్య కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్టు వినాలని, లేదంటే వేధింపులు తప్పవని బెదిరించాడు. ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆ తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డ్ చేసేవాడు. అయితే ఆ వీడియోలు బయటకు రావడంతో కిషన్ ఆగడాలు వెలుగుచూశాయి. ఆ వీడియోలు చూసి ఇతర కార్మికులు కిషన్‌ను ప్రశ్నించారు. అయితే ఎవరికీ చెప్పొద్దంటూ కిషన్ డబ్బు ఆశ చూపాడు. 14 మందికి తలా రూ.10 వేల చొప్పున ముట్టజెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.