Fake Medicines Seized: ఎటువంటి డ్రగ్ వాడకుండా చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు, రూ. 33.35 లక్షల ఫేక్ మందులను స్వాధీనం చేసుకున్న తెలంగాణ డీసీఏ
రూ. 33.35 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Hyd, Mar 6: తెలంగాణలో నకిలీ టాబ్లెట్లు అమ్ముతున్న ముఠా గుట్టును డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రట్టు చేశారు. రూ. 33.35 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుద్దపొడి, స్టార్చ్‌తో కూడిన నకిలీ మందులను తెలంగాణలోని మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించి, ఉనికిలో లేని కంపెనీ మెగ్ లైఫ్‌సైన్సెస్, సిర్మోర్ మందులను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) స్వాధీనం చేసుకుంది.చాక్ పీస్ పౌడర్, గంజి పొడితో నకిలీ ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నమెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ నుంచి ట్యాబ్లెట్స్ కొనుగోలు చేయొద్దని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)అధికారులు హెచ్చరించారు. నకిలీ టాబ్లెట్ల రాకెట్ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, రూ.7.34 లక్షల విలువైన నకీల మందులు స్వాధీనం,వీడియోలు ఇవిగో..
డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి తెలిపిన ప్రకారం... హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మూర్ జిల్లా పల్లిగాన్ ప్రాంతంలో మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి డ్రగ్, మెడిసిన్ వాడకుండా ట్యాబ్లెట్స్ తరహాలో ఉండే ఖాళీ బిళ్లను మార్కెట్ చేస్తున్నారు. ఇటీవల డీసీఏ అధికారులు జరిపిన తనిఖీల్లో మెగ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన రూ. రూ.33.35 లక్షల విలువైన నకిలీ ట్యాబ్లెట్స్‌ను సీజ్ చేశారు. డీలర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా హిమాచల్ ప్రదేశ్‌లో మెగ్ లైఫ్‌సైన్సెస్ కంపెనీలో సోదాలు చేశారు.
Here's News
ప్రాణాంతకమైన మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ మందులు వాడొద్దని డీజీ కమలాసన్‌రెడ్డి సూచించారు. ఈ ట్యాబ్లెట్స్ సంఘ విద్రోహ శక్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ మందులు నకిలీగా గుర్తించాలని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ మందులు మార్కెట్‌లో గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-6969 లేదా https://dca.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా సంబంధిత ప్రాంతానికి చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.