Fine Rice For Ration Card Holders: రేష‌న్ కార్డుదారుల‌కు గుడ్ న్యూస్! జ‌న‌వ‌రి నెల నుంచి ఇక‌పై రేష‌న్ షాపుల్లో స‌న్న‌బియ్యం, ప్ర‌క‌టించిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

వచ్చే జనవరి నుండి చౌక ధరల దుకాణాల్లో (Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు.

Ration Cards (Credits: X)

Hyderabad, AUG 22: ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం (Ration Card Holders) ఇస్తామన్నారు. పీడీఎస్ (PDS Rice) బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. బియ్యం తరలిస్తూ పట్టుబడితే డీలర్ షిప్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Telangana: వీడియో ఇదిగో, హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రం అయిందంటూ నీటితో శుద్ది చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. వారి న్యాయమైన కోర్కెల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడీ, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. మహాలక్ష్మి పధకం లబ్ధిదారులకు చేరుతున్న సబ్సిడీ విషయం లబ్ధిదారులకు చేరవేయాలన్నారు.