Fire Accident In Hyderabad: మైలార్ దేవ్ పల్లి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..

స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చుట్టుపక్కలంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కంపెనీ ఇళ్ల మధ్య ఉండటంతో దట్టమైన పొగకు స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Fire Accident (Photo-ANI)

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చుట్టుపక్కలంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కంపెనీ ఇళ్ల మధ్య ఉండటంతో దట్టమైన పొగకు స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Oscars 2022: నా భార్య మీదే జోక్ వేస్తావా, కమెడియన్ చెంప పగలగొట్టిన ఆస్కార్ ఉత్తమ నటుడు స్మిత్, తరువాత క్షమాపణలు కోరిన విల్ స్మిత్‌

మంటల తీవ్రత అధికమవ్వడంతో ఇళ్లకు అంటుకుంటాయని భయాందోళన చెందుతున్నారు. కాగా.. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ కంపెనీని నిర్వహిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. వారు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా ? ప్రాణనష్టం జరిగిందా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.



సంబంధిత వార్తలు