Telangana: దుబాయ్ జైలు నుంచి ఐదుగురు తెలంగాణవాసుల విడుద‌ల‌, 18 ఏళ్ల జైలు జీవితం త‌ర్వాత కేటీఆర్ చొర‌వ‌తో స్వ‌దేశానికి రాక‌

ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్‌ కోర్టు (Dubai Court) శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

Five telangana residents released (PIC@ BRS @ X)

New Delhi, FEB 21: దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి (Telangana Residents released) లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్‌ కోర్టు (Dubai Court) శిక్షను 25 ఏళ్లకు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నేపాల్ వెళ్లి .. హతుని కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా.. మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు.

 

అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది. దీంతో దుబాయ్‌ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌ వచ్చారు. 18ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం