Flyover Ramp Collapse: ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం, నిర్మాణం మధ్యలోనే కుప్పకూలిన ఫ్లై ఓవర్, 10మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన కార్మికులంతా బీహార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.
Hyderabad, June 21: ఎల్బీనగర్ (Lb Nagar)పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్డు (Sagar Ring Road) కూడలిలో ప్లైఓవర్ నిర్మాణ పనుల సమయంలో విషాదం చోటు చేసుకుంది. ప్లై ఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది(Flyover Ramp Collapse). ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన కార్మికులంతా బీహార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చనే అనుమానంతో పొక్లెయిన్ సహాయంతో శిథిలాలను తొలగించే ప్రక్రియలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేజర్ ప్రాజెక్టు అధికారులు ఘటన స్థలం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.