Bandi Sanjay Meets Amit Shah: అమిత్ షాతో బండి సంజయ్ భేటీ, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడి

ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలిశారు.ఈ సందర్భంగా గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కేంద్రమంత్రిని కోరారు.

Bandi Sanjay Met Amit Shah (photo-Twitter)

ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలిశారు.ఈ సందర్భంగా గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కేంద్రమంత్రిని కోరారు. అయితే పార్టీలో తన వర్గాన్ని పక్కన పెడుతున్నారంటూ బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి అందించిన సేవలను గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

బండి సంజయ్‌ తనను కలిసినట్లు అమిత్‌ షా స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను కరీంనగర్‌ ఎంపీతో చర్చించానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కేంద్రమంత్రితో భేటీపై ఇటు బండి సంజయ్‌ సైతం ట్వీట్‌ చేశారు. రాజకీయ చాణక్యుడు అమిత్ షాను కలవడం ఆనందంగా ఉందన్నారు.

వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, వీఆర్‌ఏలను పలు శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా సర్ధుబాటు చేసిన ప్రభుత్వం

ఆయన మార్గదర్శనంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తానని తెలిపారు.అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి కోల్పోయిన అనంతరం కేంద్ర మంత్రిని బండి కలవడం ఇదే తొలిసారి కావడంతో భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.