Gaddar Final Journey: మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం.. బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు.. రూట్ మ్యాప్ వివరాలు ఇవిగో!
పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు.
Hyderabad, Aug 7: ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) మరణంతో తెలంగాణ (Telangana) పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో (LB Stadium) ఉంచారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమవుతుంది.
PM Modi Statue: ప్రపంచంలోనే అతి పెద్ద మోదీ విగ్రహం.. పుణెకి సమీపంలోని లావాసాలో నిర్మాణం.. వీడియో
రూట్ మ్యాప్ ఇదిగో..
- ఎల్బీ స్టేడియం నుంచి తొలుత గన్ పార్క్ కు గద్దర్ పార్థవదేహాన్ని తీసుకెళ్తారు.
- అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ లోని ఆయన ఇంటి వరకు యాత్ర కొనసాగుతుంది.
- గద్దర్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచుతారు.
- అనంతరం ఆయనకు చెందిన బోధి విద్యాలయంకు తీసుకెళ్తారు. అక్కడే అంత్యక్రియలను నిర్వహిస్తారు.