Gangster Nayeem Case: తెరపైకి మళ్లీ నయీం కేసు, 25 మంది పోలీస్ అధికారులకు క్లీన్ చిట్, వీరికి నయీంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం
ఎన్‌కౌంటర్ అనంతరం వెలుగులోకి విషయాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో వీరందరికీ సంబంధాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ల్యాండ్ సెటిల్‌మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఈ 25 మంది పోలీస్ అధికారులకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని (sit clean chit to 25 police officials) తేల్చింది.
Hyd, Oct 3: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో (Gangster Nayeem Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్ అనంతరం వెలుగులోకి విషయాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో వీరందరికీ సంబంధాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ల్యాండ్ సెటిల్‌మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఈ 25 మంది పోలీస్ అధికారులకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని (sit clean chit to 25 police officials) తేల్చింది.
అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను నుంచి తొలగిస్తున్నట్లు సిట్ పేర్కొంది. ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు.
నయీం ఎన్‌కౌంటర్, తదనంతరం పరిణామాలపై సిట్ 175కుపైగా చార్జ్‌సీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీరిలో ఇద్దరూ అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు,13 మంది సీఐలు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా వీరందరికి క్లీన్‌చీట్ ఇస్తున్నట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు.
మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు కోరారు.
2016 ఆగస్టు 8న షాద్‌నగర్ సమీపంలో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ (Gangster Nayeem Encounter) జరిగింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నయీం చనిపోయిన ఆ తర్వాత.. నయీమ్ దందాలు.. దారుణాలు.. ఒక్కొకటిగా బయటకురావడం మొదలయ్యాయి. ముఖ్యంగా అప్పటి వరకు నయీమ్‌కి బయపడి తన గురించి కానీ, తన దందాలు గురించి కాని బయటకు చెప్పటానికి ఇష్టపడిన వాళ్లంతా ఒక్కొకరుగా బయటకు వచ్చారు. నయీమ్ తమను ఎలా బెదిరించారో పోలీసులుకు చెప్పడం మొదలు పెట్టారు.
అలా బాధితుల సంఖ్య పెరుగడంతో నయీమ్ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. నయీం బాధితుల్లో చాలా మంది పెద్ద వాళ్లు, ప్రముఖులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతడికి రాజకీయ నేతలు, పోలీసుల అండదండలున్నాయనే విషయం తెలిసింది. ఈ క్రమంలోనే నయీమ్‌తో సంబంధమున్న ఐదుగురు అధికారులను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. దర్యాప్తులో నయీమ్‌కు ఆస్తులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నయీమ్‌కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. వివిధ ప్రాంతాల్లో 1,019 ఎకరాల భూములు, 29 భవనాలు ఉన్నాయి. వీటితోపాటు 2 కేజీల బంగారం, రూ.2కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్లీన్ చిట్ పొందినవారి వివరాలు
అడిషనల్ ఎస్పీ లు
శ్రీనివాస్ రావు
చంద్రశేఖర్
డీఎస్‌పీలు..
సీహెచ్. శ్రీనివాస్
ఎం శ్రీనివాస్
సాయి
మనోహర్
ప్రకాష్ రావు
వెంకట నరసయ్య
అమరేందర్ రెడ్డి
తిరుపతన్న
ఎస్‌ఐలు..
మస్తాన్
రాజగోపాల్
వెంకటయ్య
శ్రీనివాస్ నాయుడు
కిషన్
ఎస్ శ్రీనివాసరావు
వెంకట్ రెడ్డి
మజీద్
వెంకట సూర్య ప్రకాష్
రవి కిరణ్ రెడ్డి
బలవంత య్య
నరేందర్ గౌడ్
రవీందర్
కానిస్టేబుల్ దినేష్
ఆనంద్
బాలన్న
సదాత్ మియా