GHMC Election 2020: వెలవెలబోతున్న ఓటింగ్ కేంద్రాలు, బయటకు రాని ఓటరు, 3 గంటల వరకు 25.34 శాతం ఓటింగ్ నమోదు, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections) అత్యంత దారుణంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 1గంట సమయానికి 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం, అత్యల్పంగా తలాబ్ చంచలం 0.74 శాతం, అమీర్ పేట్ 0.79 శాతం ఓటింగ్ నమోదైంది.
Hyderabad, Dec 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (GHMC Election 2020) ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections) అత్యంత దారుణంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 1గంట సమయానికి 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం, అత్యల్పంగా తలాబ్ చంచలం 0.74 శాతం, అమీర్ పేట్ 0.79 శాతం ఓటింగ్ నమోదైంది.
ఎన్నికల అధికారుల తప్పిదం కారణంగా ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దయింది. బ్యాలెట్ పత్రం మీద సీపీఐ గుర్తు ఉండాల్సిన చోట సీపీఎం గుర్తును ముద్రించారు. ఈ విషయాన్ని గమనించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అక్కడ రేపు రీ పోలింగ్ జరగనుంది. కొన్ని చోట్ల ఓటర్లకు స్లిప్పులు ఇవ్వకపోవడంతో వారు పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న డిజిటల్ స్లిప్పులను ఓటర్లు చూపిస్తున్నా.. అసలు మొబైల్ ఫోన్లకు అనుమతి లేదంటూ పోలింగ్ సిబ్బంది వారిని వెనక్కు పంపేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఓటర్లు వెనుదిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపుర్ డివిజన్ హఫీజ్‌పేట, ప్రేమ్‌నగర్ పోలింగ్ కేందాన్ని సీపీ సందర్శించారు. కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లిలోని పలు డివిజన్లలోని పోలింగ్ బూత్‌లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని తెలిపారు. ఎవరైనా ఎటువంటి గొడవలకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ప్రజలు అందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పలు పోలింగ్ బూత్ ల దగ్గర ఘర్షణలు జరుగుతున్నాయి. హఫీజ్ పేట్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించారు. ఆర్కేపురం పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటుచేసుకుంది. ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఉప్పల్ పదవ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్‌లో దొంగ ఓట్లు వేస్తున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్‌ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆధార్ కార్డులోని ఫోటోలను మార్ఫింగ్ చేసి యువకులు ఓటు వేసినట్లు తెలుస్తోంది. వీరిని కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట నుంచి తీసుకొచ్చినట్లు టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కేపీహెచ్‌బీ ఫోరంమాల్ సమీపంలో మంత్రి పువ్వాడ అజయ్ అనుచరులు డబ్బు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి అనుచరుల కార్లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనలో పువ్వాడ అనుచరులకు సంబంధించిన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
నాంపల్లిలోని వ్యాయమశాల హైస్కూల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఫిల్మ్ క్లబ్‌లో సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లిహిల్స్ బిఎస్‌ఎన్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, భార్య శ్రీకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బంజారాహిల్స్ ఈరో కిడ్స్ స్కూల్‌లో విజయ శాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
షేక్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో హీరో రామ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సినీ నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బంజారాహిల్స్ జీఎస్డీ దేవ్ స్కూల్‌లో (డివిజన్ నెంబర్ 92 వెంకటేశ్వరరావు కాలనీ) ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఫిల్మ్ క్లబ్‌లో నిర్మాత సి అశ్వనీదత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఫిల్మ్ క్లబ్‌లో అల్లు అర్జున్ సతీమణి స్నేహలతా రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కచ్చితంగా ఓటు వేయడానికి ముందకు రావాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.
మలక్‌పేట సర్కిల్ అజంపూరా డివిజన్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మలక్‌పేట సర్కిల్ అజంపూరా డివిజన్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మారేడుపల్లిలోని కస్తూర్భాగాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేస్ పోలింగ్ బూత్ నెంబర్ 58 వద్ద సినీ హీరో రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉమెన్స్ కోఆపరేటివ్ సోసైటీలో బూత్ నెంబర్ 95లో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అక్కినేని అమల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం 135వ డివిజన్‌లో బూత్ నెంబర్ 38లో ప్రజాగాయకుడు గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎస్‌ఈసీ పార్థసారధి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-4లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కుందన్‌బాగ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో డైరెక్టర్ తేజ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ వి.ఎన్. రెడ్డి నగర్ ప్రగతి విద్యాలయ పాఠశాలలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టీఆర్‌పార్టీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆయన సతీమణి స్వప్న హబ్సిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర మైలాన్‌దేవ్ పల్లిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబంతో సహా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ కాలనీలో సామాన్య ప్రజలతో కలిసి క్యూ లైన్‌లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
శాస్త్రిపురం డివిజన్లోని సేంట్ ఫైజ్ పాఠశాలలో బైక్పై వచ్చి ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాజేంద్రనగర్‌లోని ఉప్పరిపల్లిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉష మూల్పూరి షేక్‌పేట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ కుందన్‌బాగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కుందన్‌బాగ్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీక్లబ్‌లో చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కుందన్‌బాగ్‌లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్‌లోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా కలిసి వచ్చిన కేటీఆర్ 8వ నెంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటును వినియోగించుకున్నారు.