GHMC Elections 2020: మేయర్ పీఠం మాదే, జోస్యం చెప్పిన అమిత్ షా, కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావాలి, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని తెలిపిన కేంద్ర హోం మంత్రి

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని.. మేయర్‌ పీఠం దక్కించుకుంటుందని (Hyderabad’s Next Mayor Will be From BJP) కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు.

Home Minister Amit Shah | (Photo Credits: ANI)

Hyderabad, November 29: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని.. మేయర్‌ పీఠం దక్కించుకుంటుందని (Hyderabad’s Next Mayor Will be From BJP) కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే బీజేపీ విజయం ఖాయమని తెలుస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆయన సికింద్రాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకొని మీడియాతో మాట్లాడారు.

మీడియాతో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావాలని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections 2020) పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు.

Shah Hits Out at Owaisi on Rohingya, Bangladeshi 'Infiltration'  

బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని, సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదని విమర్శించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

భాగ్యలక్ష్మీ ఆలయానికి భక్తితో వెళ్లానని.. రాజకీయ కారణాలు లేవన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఏ ఎన్నికలనూ బీజేపీ తక్కువగా చూడదన్నారు. ప్రజలకు ఆయుష్మాన్ భారత్‌ ఫలాలు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. మోదీకి పేరుస్తుందని.. ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ రాజకీయాల వల్లే పేదలకు సరైన వైద్యం అందడం లేదన్నారు.

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా, ఈ బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఇంతమందా? ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్, బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ పేరు మార్చుతామని తెలిపిన యోగీ ఆదిత్యనాథ్

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందన్న ఆయన.. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం ఒక్కటే కాదన్నారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, తెలంగాణలో పరిపాలనా సామర్థ్యం ఇంకెవరికీ లేదా? అన్నారు. నిజాం సంస్కృతి నుంచి ఆధునిక నగరంగా (Promises to End ‘Nizam Culture, Appeasement) హైదరాబాద్‌ను మారుస్తామన్నారు. మజ్లీస్‌తో టీఆర్ఎస్‌ పొత్తు పెట్టుకుంటే అభ్యంతరం లేదని, కానీ రహస్య పొత్తు ఎందుకన్నారు. బహిరంగంగానే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవచ్చు కదా అన్నారు. తెలంగాణను పాకిస్తాన్‌లో కలపమని మొదట ఎవరన్నారో ఓవైసీ చెప్పాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. ప్రజలకు ఆయుష్మాన్ భారత్‌ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు’’ అంటూ విమర్శించారు. హైదరాబాద్‌ నీళ్లలో మునిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోడ్ల మీదకు రాలేదు.. ఎమ్మెల్యేలతో మాట్లాడలేదని విమర్శించారు.

సర్జికల్ స్ట్రైక్ అంటే కేసులే.., బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య‌తో సహా 50 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు, మీడియాకు వెల్లడించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

ప్రధాని మోదీ ఏం చెప్తారో.. అదే చేస్తారు. 2014, 19లో మేమిచ్చిన వాగ్ధాలన్నీ పూర్తిచేశాం.నేనడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్తారనే ఆశిస్తున్నా. గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. 15 డంపింగ్ యార్డులు అన్నారు.. ఎక్కడున్నాయి? 15 డంపింగ్ యార్డులు అన్నారు.. ఎక్కడున్నాయి? కొత్త ఆస్పత్రుల నిర్మాణం అన్నారు.. ఏమైంది? ప్రజలకు ఆయుష్మాన్ భారత్‌ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు.

అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం అన్నిసరిహద్దులు దాటేసింది. ఎంఐఎంతో పొత్తు ఉందో..లేదో చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నారు? నేరుగా సీట్లు పంచుకొని పోటీ చేయండి. హైదరాబాద్‌లో రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను ఏరివేద్దామనుకుంటే పార్లమెంటులో అడ్డుకున్నది ఎవరు? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం. మా ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌దే కీలకపాత్ర. కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే మా విజయం ఖాయమని తెలుస్తుంది.

నేను ఎన్నికల కోసం వచ్చాను.. కేసీఆర్‌ను కొట్టడానికి కాదు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలి. అధికారం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచానికే ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం.కేంద్రం ద్వారా హైదరాబాద్‌ చిరువ్యాపారులకు అత్యధికంగా లాభం జరిగింది.నవాబు, నిజాం సంస్కృతుల నుంచి విముక్తి చేసి..హైదరాబాద్‌ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now