GHMC Polls 2020: సర్జికల్ స్ట్రైక్ అంటే కేసులే.., బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య‌తో సహా 50 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు, మీడియాకు వెల్లడించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
Telangana DGP Mahender Reddy (File photo)

Hyd, Nov 26: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో భాగ్యనగరంలో అలజడి రేపుందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ (Telangana DGP Mahender Reddy Press Meet) నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని, గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Polls 2020) ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. గ్రేటర్‌ ఎన్నికలను (Greater Hyderabad Municipal Corporation (GHMC) polls) ఆసరాగా తీసుకుని హైదరాబాద్‌లో మత ఘర్షణలు తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి అంశాలపై తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Telangana State Police  Tweet

సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర, కఠినచర్యలు తప్పవని హెచ్చరించిన సీపీ అంజనీకుమార్, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్‌‌ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. మూడు కమిషనరేట్ పరిధి లో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

పోలీస్ శాఖ ఉన్నత సమావేశం ఏర్పాటు చేశామని, ముందస్తుగా ఉన్న సమాచారం మేరకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసకున్నామన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు (Case Against BJP MP Tejasvi Surya) చేసినట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కొందరు నేతల ప్రసంగాలు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు.

మోగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా, డిసెంబర్ 1న ఓటింగ్, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌, నామినేష్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 20, నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 21వరకు..

నేతల ప్రసంగాలను పరిశీలిస్తున్నామని, విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న నేతలపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని డీజీపీ అన్నారు. గత ఆరేళ్లలో నగరంలో ఎలాంటి ఘటనలు జరగలేదని... కానీ, ఇప్పుడు విద్వేషాలను రగిల్చేందుకు కొందరు యత్నిస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.