GHMC Elections 2020: విపక్షాలకు దిమ్మతిరిగేలా గ్రేటర్‌లో విజయం సాధిస్తాం, ధీమా వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, అభ్యర్థుల తొలి జాబితా రెడీ, బీజేపీలో చేరిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి

అధికార టీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో భాగంగా 105 డివిజన్లకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బీజేపీ 21 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.

GHMC Elections 2020 (Photo-File Image)

Hyd, Nov 19: డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections 2020) పోటీ చేసేందుకు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో భాగంగా 105 డివిజన్లకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బీజేపీ 21 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. పార్టీలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. దుబ్బాక ఓటమితో గ్రేటర్ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ (TRS) పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ (CM KCR) మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో (GHMC Elections) టీఆర్‌ఎస్‌ 110 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెప్తున్నాయి. గతంలోనూ టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని ప్రచారం చేసిన సందర్భంలో పార్టీ లేచి దెబ్బకొడితే విపక్షాలకు నషాళానికి అంటింది. నేను ఫైటర్‌ను.. దేనికీ భయపడేది లేదు’అని గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ (TRS) విజయంపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో మారిన ఆంక్షలు, కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల జరిగే కార్యక్రమాలకు 200 మందికి అనుమతి, కంటైన్మెంట్‌ జోన్లలో అనుమతి నిషిద్ధం

ఇక కాంగ్రెస్‌ (Congress) పార్టీకి ‘గ్రేటర్‌’ ఎన్నికల వేళ భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నానని, తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బండ కార్తీక ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

టీఎస్‌–బీపాస్‌ కస్టమర్ ఛార్జీలు ఖరారు, ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించాలి, 75 చదరపు గజాలలోపు ఉంటే అనుమతి ఉచితం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లిస్ట్

కాప్రా–ఎస్‌.స్వర్ణరాజ్‌(ఎస్సీ); నాగోల్‌– చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌(బీసీ); మన్సూరాబాద్‌– కొప్పుల విఠల్‌రెడ్డి(ఓసీ); హయత్‌నగర్‌– ఎస్‌.తిరుమల్‌రెడ్డి(ఓసీ); బీఎన్‌రెడ్డి నగర్‌– ఎం.లక్ష్మీప్రసన్నగౌడ్‌(బీసీ); వనస్థలిపురం– జిట్టా రాజశేఖర్‌రెడ్డి(ఓసీ); హస్తినాపురం– రమావత్‌ పద్మానాయక్‌ (ఎస్టీ); చంపాపేట్‌– సామ రమణారెడ్డి(ఓసీ); లింగోజిగూడ– శ్రీనివాసరావు(బీసీ); సరూర్‌నగర్‌– అనితా దయాకర్‌రెడ్డి(ఓసీ), ఆర్కేపురం– ఎం.విజయభారతి అరవింద్‌ శర్మ(ఓసీ); కొత్తపేట– జీవీసాగర్‌రెడ్డి(ఓసీ); చైతన్యపురి– జె.విఠల్‌రెడ్డి(ఓసీ); గడ్డిఅన్నారం– బి.ప్రవీణ్‌కుమార్‌(బీసీ); సైదాబాద్‌– సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి(ఓసీ); ముసారాంబాగ్‌– తీగల సునరితారెడ్డి(ఓసీ); ఓల్డ్‌మలక్‌పేట్‌– పి.శైలిని(బీసీ); అక్బర్‌బాగ్‌– ఎం.శ్రీధర్‌రెడ్డి(ఓసీ); అజంపుర– భారతి బాబురావు(ఎస్సీ); చావని– ఎండీ షవౌత్‌ అలీ(మైనార్టీ); డబీర్‌పుర– ఎండీ షబ్బీర్‌(మైనార్టీ);

రెయిన్‌బజార్‌– అబ్దుల్‌ జావేద్(మైనార్టీ); పత్తర్‌గట్టి– అక్తర్‌మెహినోద్దీన్‌(మైనార్టీ); మొగల్‌ఫుర– ఎస్‌వీ సరిత(బీసీ); తలాబ్‌ చెంచలం– మెహరున్నీసా(మైనార్టీ), గౌలిపుర– బొడ్డు సరిత(బీసీ); లలిత్‌బాగ్‌– జి.రాఘవేంద్రరాజు(బీసీ); కుర్మగూడ– ఎం. నవిత యాదవ్‌(బీసీ); ఐఎస్‌ సదన్‌– స్వప్న సుందర్‌రెడ్డి(ఓసీ); సంతోష్‌నగర్‌– శ్రీనివాసరావు(బీసీ); రియాసత్‌నగర్‌– సంతోష్‌కుమార్‌(బీసీ); కంచన్‌బాగ్‌– ఆకుల వసంత(బీసీ); బార్కస్‌– సరిత(బీసీ); చాంద్రాయణగుట్ట– సంతోష్‌రాణి(బీసీ); ఉప్పుగూడ– ఎం శోభారాణిరెడ్డి(ఓసీ);

జంగమ్మెట్‌– కె.స్వరూపరాంసింగ్‌నాయక్‌(ఎస్టీ); ఫలక్‌నుమా– గిరిధర్‌నాయక్‌(ఎస్టీ); నవాబ్‌సాబ్‌కుంట– సమీనాబేగం(మైనార్టీ); శాలిబండ– రాధాకృష్ణ(బీసీ); ఘాన్సీబజార్‌– ఇషిత(బీసీ); గోషామహల్‌– ముకేష్‌సింగ్‌(బీసీ); పురానాపూల్‌– లక్ష్మణ్‌గౌడ్‌(బీసీ); దూద్‌బౌలి– షబానా అంజుమ్‌(మైనార్టీ); జాహనుమా– పల్లె వీరమణి(బీసీ); రాంనాస్‌పుర– మహ్మద్‌ ఇంకేషాఫ్‌(మైనార్టీ); కిషన్‌బాగ్‌– షకీల్‌ అహ్మద్‌(మైనార్టీ); జియాగూడ– కృష్ణ(ఎస్సీ); మంగళ్‌హాట్‌– పరమేశ్వరిసింగ్‌(బీసీ);

దత్తాత్రేయనగర్‌– ఎండీ సలీం(మైనార్టీ); కార్వాన్‌– ముత్యాల భాస్కర్‌(బీసీ); లంగర్‌హౌస్‌– పర్వతమ్మయాదవ్‌(బీసీ); గొల్కొండ– ఆసిఫాఖాన్‌(మైనారీ్ట); టోలిచౌకి– నాగజ్యోతి(బీసీ); నానల్‌నగర్‌– ఎస్‌కే హజర్‌(మైనార్టీ); మెహిదీపట్నం– సంతోష్‌కుమార్‌(మరాఠ); గుడిమల్కాపూర్‌– బంగారి ప్రకాష్‌(బీసీ); ఆసిఫ్‌నగర్‌– ఎం.సాయిశిరీష(బీసీ); విజయనగర్‌కాలనీ– స్వరూపరాణి(బీసీ); రహమత్‌నగర్‌– సారిక(బీసీ); రెడ్‌హిల్స్‌– ప్రియాంకగౌడ్‌(బీసీ); మల్లెపల్లి– ఎం.పద్మావతి(బీసీ); జాంబాగ్‌– ఆనంద్‌గౌడ్‌(బీసీ); గన్‌ఫౌడ్రీ– మమతాగుప్తా(ఓసీ); రాంనగర్‌– శ్రీనివాసరెడ్డి (ఓసీ); గాంధీనగర్‌– పద్మనరేష్‌(బీసీ); ఖైరతాబాద్‌– విజయారెడ్డి(ఓసీ); వెంకటేశ్వరకాలనీ– కవితారెడ్డి(ఓసీ);

బంజారాహిల్స్‌– విజయలక్ష్మీ(బీసీ); జూబ్లీహిల్స్‌– కె. సూర్యనారాయణ(ఓసీ); సోమాజిగూడ– వి.సంగీతా యాదవ్‌(బీసీ); అమీర్‌పేట్‌– శేషుకుమారి(కాపు); సనత్‌నగర్‌– లక్ష్మీ(ఓసీ); ఎర్రగడ్డ– పి.మహేందర్‌యాదవ్‌(బీసీ); బోరబండ– బాబా ఫసియొద్దీన్‌(మైనార్టీ); కొండాపూర్‌– షేక్‌ హమీద్‌పటేల్‌(మైనార్టీ); గచ్చిబౌలి– ఎస్‌కే బాబా(బీసీ); మాదాపూర్‌– జగదీశ్వర్‌గౌడ్‌(బీసీ); మియాపూర్‌– ఉప్పలపతి శ్రీకాంత్‌(ఓసీ); హఫీజ్‌పేట్‌– వీపీ జగదీశ్వర్‌(బీసీ);

భారతినగర్‌– సింధూ ఆదర్శ్‌రెడ్డి(ఓసీ); ఆర్సీపురం– పి.నగేష్‌ యాదవ్‌(బీసీ); పటాన్‌చెరు– ఎం.కుమార్‌యాదవ్‌(బీసీ); కేపీహెచ్‌బీకాలనీ– ఎం.శ్రీనివాసరావు(ఓసీ); బాలాజీనగర్‌– శీరిషబాబురావు(బీసీ); అల్లాపూర్‌– సబీహాబేగం(మైనార్టీ); మూసాపేట్‌– శ్రవణ్‌కుమార్‌(బీసీ); ఫతేనగర్‌– సతీష్‌గౌడ్‌(బీసీ); బోయిన్‌పల్లి– ఎం.నర్సింహ్మాయాదవ్‌(బీసీ); అల్విన్‌కాలనీ– వెంకటేష్‌గౌడ్‌(బీసీ); గాజులరామారం– రావుల శేషగిరి(బీసీ); జగద్గిరిగుట్ట– కె.జగన్‌(బీసీ); రంగారెడ్డినగర్‌– విజయశేఖర్‌గౌడ్‌(బీసీ); చింతల్‌– రషీదాబేగం(మైనార్టీ);

సూరారం– ఎం.సత్యనారాయణ(బీసీ); సుభాష్‌నగర్‌– ఆదిలక్ష్మి(ఓసీ); కుత్బుల్లాపూర్‌– పారిజాతగౌడ్‌(బీసీ); జీడిమెట్ల– పద్మప్రతాప్‌గౌడ్‌(బీసీ); మచ్చబొల్లారం– జితేందర్‌నాథ్‌(ఎస్సీ), అల్వాల్‌– విజయశాంతి(ఓసీ); వెంకటాపురం– సబితా కిషోర్‌(ఎస్సీ); మల్కాజ్‌గిరి– జగదీ‹Ùగౌడ్‌(బీసీ); సీతాఫల్‌మండి– హేమ(బీసీ); బన్సీలాల్‌పేట్‌– హేమలత(ఎస్సీ); రాంగోపాల్‌పేట్‌– అరుణ(బీసీ); మోండామార్కెట్‌– ఆకుల రూప(బీసీ)

టీఆర్ఎస్ రెండో జాబితా

1.మల్లాపూర్‌- దేవేందర్‌రెడ్డి

2.రామాంతపూర్-జ్యోత్స్న

3.బేగంబజార్‌-పూజా వ్యాస్ బిలాల్‌

4.సులేమాన్‌నగర్‌-సరితా మహేష్‌

5.శాస్త్రిపురం-బి.రాజేష్ యాదవ్

6.మైలార్‌దేవ్‌పల్లి-ప్రేమ్‌దాస్ గౌడ్‌

7.రాజేంద్రనగర్‌-శ్రీలత

8.హిమాయత్‌నగర్- హేమలత యాదవ్

9.బాగ్ అంబర్‌పేట్- పద్మావతి రెడ్డి

10.బోలక్‌పూర్‌-బింగి నవీన్‌కుమార్

11.షేక్‌పేట్‌-సత్యనారాయణ యాదవ్

12.శేరిలింగంపల్లి-నాగేంద్రయాదవ్‌

13.బాలానగర్-ఆవుల రవీందర్‌రెడ్డి

14.కూకట్‌పల్లి-జూపల్లి సత్యనారాయణ

15.వివేకానందనగర్ కాలనీ-మాధవరం రోజా రంగారావు

16.వినాయకనగర్-పుష్పలత

17.అడ్డగుట్ట-ప్రసన్నలక్ష్మి

18.మెట్టుగూడ-సునీత

19.బౌద్ధనగర్-శైలజ

20.బేగంపేట్‌- మహేశ్వరి

మోగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా, డిసెంబర్ 1న ఓటింగ్, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌, నామినేష్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 20, నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 21వరకు..

కాంగ్రెస్‌ అభ్యర్థుల లిస్ట్

కాప్రా– శ్రీపతికుమార్‌(ఎస్సీ); ఏఎస్‌రావు నగర్‌– శిరీషారెడ్డి (ఓసీ); ఉప్పల్‌– ఎం.రజిత(ఓసీ); నాగోల్‌– ముస్కు శైలజ(ఓసీ); మన్సూరాబాద్‌– జక్కిడి ప్రభాకర్‌రెడ్డి(ఓసీ); హయత్‌నగర్‌– గుర్రం శ్రీనివాసరెడ్డి(ఓసీ); హస్తినాపురం– సంగీతానాయక్‌(ఎస్టీ); ఆర్కేపురం– పున్న గణేష్‌ నిర్మలానేత(బీసీ); గడ్డిఅన్నారం– వెంకటేష్‌యాదవ్‌(బీసీ); సులేమాన్‌నగర్‌– రిజ్వానాబేగం(బీసీ); మైలార్‌దేవులపల్లి– శ్రీనివాస్‌గౌడ్‌(బీసీ); రాజేంద్రనగర్‌– బి.దివ్వ(ఎస్సీ); అత్తాపూర్‌– భాస్కర్‌గౌడ్‌(బీసీ); కొండాపూర్‌– మహిపాల్‌యాదవ్‌(బీసీ); మియాపూర్‌– ఇలియాస్‌ షరీఫ్‌(మైనార్టీ), అల్లాపూర్‌– కౌసర్‌బేగం(మైనార్టీ); మూసాపేట్‌– రాఘవేందర్‌(ఓసీ); ఓల్డ్‌బోయిన్‌పల్లి– అమూల్య(ఓసీ); బాలానగర్‌– సత్యం శ్రీరంగం(ఓసీ); కూకట్‌పల్లి– వెంకటేశ్వర్‌రావు(ఓసీ)

గాజుల రామారం– కూన శ్రీనివాస్‌గౌడ్‌(బీసీ); రంగారెడ్డినగర్‌– గిరిగి శేఖర్‌(బీసీ); సూరారం– వెంకటేష్‌(ఓసీ); జీడిమెట్ల– బండి లలిత(ఓసీ); నేరేడ్‌మెట్‌– మరియమ్మ(ఓసీ); మౌలాలి– ఉమా మహేశ్వరి(బీసీ); మల్కాజ్‌గిరి– శ్రీనివాస్‌గౌడ్‌(బీసీ); గౌతంనగర్‌– తపస్వినీ యాదవ్‌(బీసీ); బేగంపేట్‌– మంజులారెడ్డి(ఓసీ); మూసారంబాగ్‌– లక్ష్మీ(ఓసీ); ఓల్డ్‌మలక్‌పేట్‌– వీరమణి(బీసీ); పత్తర్‌గట్టి– మూసాఖాసీం(మైనార్టీ); ఐఎస్‌ సదన్‌– కె.మంజుల(ఓసీ);

సంతోష్‌నగర్‌– మతీన్‌ షరీఫ్‌(బీసీ); పురానాఫూల్‌– మహ్మద్‌సాహిల్‌ అక్బర్‌(బీసీ); లలితాబాగ్‌– అబ్దుల్‌ ఇర్ఫాన్‌(మైనార్టీ); రియాసత్‌నగర్‌– సయ్యద్‌ముస్తాఫా ఖాద్రీ (మైనార్టీ); కంచన్‌బాగ్‌– అమీనాసబా(బీసీ); బార్కస్‌– షహనాజ్‌బేగం(బీసీ); చాంద్రాయణగుట్ట– షేక్‌ అఫ్జల్‌(బీసీ); నవాబ్‌సాబ్‌కుంట– మెహరాజ్‌బేగం(బీసీ); శాలిబండ– చంద్రశేఖర్‌(బీసీ); కిషన్‌బాగ్‌– అసద్‌అలీ(బీసీ); బేగంబజార్‌– పురుషోత్తం(ఓసీ); దత్తాత్రేయనగర్‌– అజయ్‌ నారాయణ(బీసీ)

బీజేపీ అభ్యర్థుల లిస్ట్

పత్తర్‌గట్టి– అనిల్‌బజాజ్‌(ఓసీ); మొగుల్‌పుర– మంజుల(ఓసీ); పురానాపూల్‌– సురేందర్‌కుమార్‌(బీసీ); కార్వాన్‌– కె.అశోక్‌(బీసీ); లంగర్‌హౌస్‌– సుగంద పుష్ప(బీసీ); టోలిచౌకి– రోజా(బీసీ); నానల్‌నగర్‌– కరణ్‌కుమార్‌(బీసీ), సైదాబాద్‌– కె.అరుణ(ఓసీ); అక్బర్‌బాగ్‌– నవీన్‌రెడ్డి(ఓసీ); డబీర్‌పుర– మిర్జా అఖిల్‌ అఫండి(మైనార్టీ); రెయిన్‌బజార్‌– ఈశ్వర్‌ యాదవ్‌(బీసీ);

లలితాబాగ్‌– చంద్రశేఖర్‌(ఎస్సీ); కుర్మగూడ– శాంత(బీసీ); ఐఎస్‌ సదన్‌– జంగం శ్వేత(ఓసీ); రియాసత్‌నగర్‌– మహేందర్‌రెడ్డి(ఓసీ); చాంద్రాయణగుట్ట– నవీన్‌కుమార్‌(బీసీ); ఉప్పుగూడ– శ్రీనివాసరావు(బీసీ); గౌలిపుర– భాగ్యలక్ష్మీ(బీసీ); శాలిబండ– నరే ష్‌(బీసీ); దూద్‌బౌలి– నిరంజన్‌కుమార్‌(బీసీ); ఓల్డ్‌ మలక్‌పేట్‌– రేణుక(బీసీ).