Telangana: తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు బావిలో దూకిన అన్నదమ్ములు, ఈత రాకపోవడంతో నీటమునిగి అన్న మృతి, మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన
తేనెటీగలను తప్పించుకునేందుకు పారిపోతూ...బావిలో దూకిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో (Mahaboobabad district) జరిగింది.
Hyderabad, March 31: పొలం పనులకు వెళ్లిన అన్నదమ్ములను తేనెటీగల (Honey bees) రూపంలో మృత్యువు వెంటాండింది. తేనెటీగలను తప్పించుకునేందుకు పారిపోతూ...బావిలో దూకిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో (Mahaboobabad district) జరిగింది. కొత్తగూడ మండలం ఎదళ్లపల్లికి చెందిన సంజీవ, జనార్ధన్ పొలం పనుల కోసం వెళ్లారు. అయితే వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇద్దరూ పరుగులు తీశారు. వాటి నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న బావిలో దూకారు ఇద్దరు అన్నదమ్ములు.
అయితే తమ్ముడు జనార్ధన్ కు ఈత రావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అన్న సంజీవ మాత్రం ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. సంజీవకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనతో ఎదళ్లపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.