Good News For Telangana Beer Lovers: తెలంగాణలో బీరు ప్రియులకు గుడ్ న్యూస్, బాటిల్‌పై ఏకంగా 30 రూపాయలు తగ్గించే చాన్స్, వేసవిలో బీర్ల సేల్స్ పెరిగే చాన్స్..
బీర్ బాటిల్ పై రూ.20-30 వరకూ తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు తగ్గించనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను 20 శాతం పెంచింది. ఆ తర్వాత రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలు తగ్గినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మద్యం ధరల పెరుగుదలతోనే అమ్మకాలు తగ్గాయని భావిస్తోన్న ప్రభుత్వం.. త్వరలోనే మద్యం ధరలను తగ్గిస్తూ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
మద్యం అమ్మకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. బీర్ బాటిల్ పై రూ.20-30 వరకూ తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు పెరుగుతున్నప్పటికీ, మద్యంపై 17 శాతం కోవిడ్ సెస్‌ను తొలగించడం ద్వారా బీర్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా.. గతేడాది జూలైలో బీర్ ధరపై రూ.10 తగ్గించగా.. అమ్మకాలు పెద్దగా పెరగలేదు.ఫలితంగా గోడౌన్లలో నిల్వలు పెరిగిపోయాయి.
వేసవిలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్న నేపథ్యంలో.. వేసవికి ముందే బీరు ధరలను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీరు ధర రూ.180 నుంచి రూ.200 ఉండగా.. ప్రభుత్వం ఆ ధరలను రూ.20 నుంచి రూ.30 వరకూ తగ్గించవచ్చని అంచనా.
Tags
beer cost in telangana
beer in telangana
beer prices in telangana
beer sales in telangana
beer shortage in telangana
beers
etv telangana
liquor sales in telangana
new beer policy in telangana
Telangana
telangana beer
telangana beers
telangana beverage
Telangana Excise
Telangana government
TELANGANA LATEST NEWS
Telangana News
telangana news live
Telangana State
TELANGANA UPDATES
Telangana Wines