Harish Rao About CM Post: కేటీఆర్ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ
కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Hyderabad, Nov 14: తెలంగాణ (Telangana) ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ (Congress) పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి (Chief Minister) కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తన దృష్టిలో పదవులకంటే వ్యక్తిత్వమే గొప్పదని చెప్పారు. కేటీఆర్ తనకు చాలా మంచి స్నేహితుడన్న హరీశ్, ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తే అంగీకరిస్తానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలను కూడా హరీశ్ తిప్పికొట్టారు.
మంచి పేరు పోగొట్టాలనే
ప్రాజెక్టుపై ఏమాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని హరీశ్ రావు అన్నారు. ‘‘కాళేశ్వరంపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం వచ్చాక రెండు పంటలు వేస్తున్నది నిజం కాదా? మంచి పేరు వచ్చిందనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారు. మంచి పేరు పోగొట్టాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు.