నాంపల్లి బజార్‌ఘాట్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 5 లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున సాయం అందజేస్తామన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే క్షతగాత్రులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Nampally Fire Accident : మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా : Minister KTR - TV9#nampally #fireaccident #tv9telugu #hyderabad pic.twitter.com/0tZVITSsOA
— TV9 Telugu (@TV9Telugu) November 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)