Kumaraswamy Meets CM KCR: నేషనల్ పార్టీపై కసరత్తు వేగవంతం చేసిన కేసీఆర్, వరుసగా ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీలు, జేడీఎస్‌ నేత కుమారస్వామితో మరోసారి సమావేశం, హైదరాబాద్‌కు వచ్చి కలిసిన కుమారస్వామి

టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారనుందని ఇప్పటికే అనఫీషియల్‌గా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నాళ్లుగా జాతీయ స్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతుండటం.. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కుమారస్వామితో భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Hyderabad, SEP 11:  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్‌ (CM kcr) రెడీ అవుతున్నారు. అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు స్పీడప్ చేశారు. ప్రగతిభవన్‌లో ఇవాళ కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామితో  (HD Kumaraswamy)  సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఉదయం ఓ హోటల్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ఆయన.. తర్వాత ప్రగతిభవన్‌ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసారు. జాతీయ రాజకీయాలతో పాటు.. బీజేపీని  (BJP) ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం బిహార్ సీఎం నితీష్‌కుమార్‌ని సీఎం కేసీఆర్‌ పాట్నా వెళ్లి కలిశారు. ఇటు హైదరాబాద్‌లో జాతీయ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వరుస భేటీలు.. కంటిన్యూగా మీటింగులు పెడుతుండడంతో బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌ నేషనల్ పార్టీని (KCR national Party) స్థాపించే ప్రయత్నాలు ఖాయంగానే కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారనుందని ఇప్పటికే అనఫీషియల్‌గా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నాళ్లుగా జాతీయ స్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతుండటం.. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కుమారస్వామితో భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే డిసెంబర్‌లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బీజేపీ చేతిలో దారుణంగా దెబ్బతిన్న జేడీఎస్‌.. కొన్నాళ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. బీజేపీ వ్యతిరేక ఎజెండానే ఇప్పుడు టీఆర్‌ఎస్‌, జేడీఎస్‌ను కలిసేలా చేశాయని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు దగ్గరపడటం.. నెక్ట్స్ ఏం చేయాలనే దానిపైనే ఇద్దరి మధ్యా చర్చ జరిగినట్లు పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ని కేసీఆర్‌ కలిసిన తర్వాత.. కుమారస్వామి కూడా కలిశారు. నితీష్‌, కుమారస్వామి జాతీయ రాజకీయాలపైనే చర్చించినట్లు తెలిసింది. నితీష్‌ కూడా విపక్షాలను ఏకం చేసేందుకు విపక్ష నేతలను కలుస్తున్నారు. ఇటు.. కేసీఆర్‌ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు.. ఈ నెలలోనే జాతీయ పార్టీని అనౌన్స్‌ చేసి మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నారు.

YS Sharmila Vs Niranjan Reddy: మంత్రి నిరంజన్‌ రెడ్డిని మెట్టుతో కొడతానన్న షర్మిల, చీల్చి చెండాడుతామంటూ ఘాటుగా జవాబిచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి, "మంగళవారం మరదలు" వ్యాఖ్యలపై ఇరువురు నేతల మధ్య మాటలయుద్ధం 

ఇందుకోసం పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు అన్నివర్గాల నుంచి సీఎం మద్దతును స్వీకరించారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని జిల్లా అధ్యక్షులు కూడా తీర్మానించడంతో కేసీఆర్‌ మరింత స్పీడు పెంచారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే టార్గెట్‌గా కేసీఆర్‌ రాజకీయ పోరాటానికి దిగినట్లు గులాబీ శ్రేణులు ప్రకటించాయి. అందుకోసం తగిన కార్యాచరణ.. ఎన్డీయేతర పార్టీలతో సమావేశం వంటి అంశాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన విధంగానే.. దేశాన్ని బీజేపీని రక్షించేందుకు అదే వ్యూహాన్ని అమలు చేస్తారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెప్తున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now