Orange Alert For Telangana: 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వారం రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని ఐఎండీ హెచ్చరిక
రాష్ట్రం అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Orange alert for 13 districts in Telangana: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రం అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకుతోడు పొడి వాతావరణం, దక్షిణ, నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్..
రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రావణి తెలిపారు. తెలంగాణలో టెంపరేచర్లు పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు. గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హీట్‌వేవ్ బిల్డప్ అవుతోందని, అన్ని ప్రాంతాల్లోనూ 44 డిగ్రీలు నమోదు అవుతున్నట్లు ఆమె చెప్పారు. మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి టెంపరేచర్లే కొనసాగనున్నట్లు శ్రావణి తెలిపారు. దేశ వ్యాప్తంగా పాత రికార్డులను బద్దలు కొడుతున్న వేడి గాలులు, మరో వారం రోజుల పాటు హీట్ వేవ్ తప్పదంటున్న ఐఎండీ, రాష్ట్రాలవారీగా ఉష్ణోగ్రతల వివరాలు ఇవిగో..
ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని చెప్పింది.
Here's Video
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఈ నెల 6 వరకు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడక్కడా తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.